ALP: రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు! 14 d ago

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యార్హత మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చేసినవారు అర్హులు. వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్ధులకు రూ. 250. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఉంటుంది. సికింద్రాబాద్ జోన్‌లో 1500 ఖాళీలు ఉన్నవి. మిగిలిన జోన్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.